ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈదురు వెంకన్న విజ్ఞప్తి
రిపోర్టర్: హరి
స్థలం: ఆదిలాబాద్
ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. గురువారం ఆదిలాబాద్ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కూటమి ఎన్నికల ప్రణాళికను కార్మికులకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్ రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అహ్మద్ అలీతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొని కార్మికుల మద్దతు కోరారు.