టెక్కలి రైలు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన అచ్చెన్నాయుడు
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్న భీంపురం, డమర గ్రామాలకు చెందిన యువకులు రైలు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన శరత్ కుమార్, విశాఖరావు, దిలీప్‌కుమార్ కుటుంబాలకు ప్రభుత్వపరంగా తగిన అండదండలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.