మున్సిపాలిటీల అభివృద్ధికి రూ 5500 కోట్లు కేటాయింపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నూజివీడు, ఏలూరు జిల్లా

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపంలో మున్సిపల్ అభివృద్ధి పనులపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మంజూరు చేసిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం ద్వారా రూ.5500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.