అనిల్ రావిపూడి చేతుల మీదుగా విభిన్న చిత్ర టీజర్ విడుదల.
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలుగు సినీ చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో తెరకెక్కుతున్న చంద్ర సిద్ధార్థ్ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు అనే వినూత్న టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు.