రూ.10 కోట్ల పరువు నష్టం దావా: కేటీఆర్‌పై ఆరోపణలొద్దు అంటూ సివిల్ కోర్టు హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
బీఆర్ఎస్ కార్యవర్గ నేత కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హెచ్చరించిందని Telugu Scribe వెల్లడించారు. కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలను తక్షణమే తొలగించాలని పలు మీడియా సంస్థలకు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.