ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' సినిమాకు ట్విట్టర్ లో పాజిటివ్ టాక్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' సినిమా ప్రీమియర్ షో పూర్తికాగా, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగగా, సెకండాఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, శివాజీ నటన సినిమాను సక్సెస్ బాట పట్టించాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.