మహిళలకు ఆరోగ్య రక్షణ కవచం ఆయుష్మాన్ భారత్ పథకం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
కుటుంబంలోని మహిళలకు ఆయుష్మాన్ భారత్ పీఎం జేఏవై పథకం ఆరోగ్య రక్షణ కవచంలా నిలుస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఈ పథకం కింద లబ్దిదారులలో సగానికి పైగా మహిళలే ఉన్నారని వెల్లడించింది. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఈ పథకం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసింది.