పాలకొండ ఎన్నికల సిబ్బంది సేవలను కొనియాడిన సబ్ కలెక్టర్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలు సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాద్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముగిశాయని కమిషనర్ పి.వి. నూకరాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సర్వశక్తులూ ఒడ్డి సహకరించిన రెవెన్యూ, పోలీస్, వైద్య, అగ్నిమాపక, సచివాలయ, మున్సిపల్ సిబ్బందితో పాటు పట్టణ ప్రజలకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో తుది ఫలితాల ప్రకటన అనంతరం అధికారుల సేవలను సబ్ కలెక్టర్ అభినందించారు.