వెంకటాచలం మండలంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్‌తో ప్రజల్లో పెరిగిన భరోసా
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి, పాటిమీద మరియు ఉలవదిబ్బ గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం సిఐ అంకమ్మతో పాటు పొదలకూరు ఎస్సై రాకేష్, మనుబోలు ఎస్ఐ హనీప్ తమ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భద్రతా భరోసా కల్పించే లక్ష్యంతో ఈ మార్చ్ చేపట్టడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.