ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడితో గంజాయి ముఠా గుట్టురట్టు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా టేకులపల్లి కేసీఆర్ టవర్ ప్రాంతంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని, సేవిస్తున్న పన్నెండు మందిని గుర్తించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని అరవై రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు.