నేరాల దర్యాప్తునకు టెక్నాలజీ తోడంటూ బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: బాపట్ల

నేరస్థలంలోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు బాపట్ల జిల్లాలో అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బాపట్ల పోలీసులు వెల్లడించారు. డీఎన్ఏ నుంచి డిజిటల్ సాక్ష్యాల వరకు సేకరించి దర్యాప్తును మరింత పటిష్టం చేయడమే ఈ ప్రత్యేక వాహన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం కానుందని అధికారులు తెలిపారు.