జపాన్ లో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై ఆరు తీవ్రత నమోదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Japan
జపాన్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై ఆరు తీవ్రతతో భూమి కంపించడంతో తీర ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయని అమెరికా భూగర్భ సర్వే వెల్లడించింది. షిమా నగరానికి ఆగ్నేయంగా యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం అందలేదని, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.