ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల పనితీరు మరియు సేవలపై ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించడం, అన్న క్యాంటీన్ల నిర్వహణ అలాగే పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సీఎం అధికారులకు పలు కీలక దిశానిర్దేశం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం వెల్లడించింది.