హైదరాబాద్ లో మీసేవ డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ప్రజా పాలనను పౌరులకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలను నేరుగా ఇంటి వద్దకే అందించే మీసేవ డోర్ డెలివరీ సదుపాయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నూతన విధానం ద్వారా పౌరులు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి గానీ, అధికారిక మీసేవ పోర్టల్ ద్వారా గానీ స్లాట్ బుక్ చేసుకుని కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇంటి వద్దే పొందవచ్చు.