ప్రజాపాలన స్ఫూర్తితో పల్లెల అభివృద్ధికి అడుగులు వేయాలి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పూలనగారి నాగేశ్వరి అశ్విన్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ప్రజాపాలన స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.