శ్రీకాకుళం జిల్లా: ఆలయ దొంగతనం కేసులో నిందితులకు కోర్టు జైలు శిక్ష

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్బలాపురం గ్రామంలో వెలసిన శ్రీ బాల త్రిపుర సుందరి సహిత కామేశ్వరి ఆలయ దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు ఇద్దరు దోషులకు రెండేళ్ల ఆరు నెలల కఠిన జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం అధికారికంగా స్పష్టం చేసింది.