రెట్రో ఫోటోల ట్రెండ్ తో సైబర్ మోసాలు: టీజీసీఎస్బీ హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న 1980ల రెట్రో ఫోటో ఎడిటింగ్ ట్రెండ్ ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్, అనధికారిక లింకుల ద్వారా మాల్ వేర్ పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదముందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించింది.