హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

రిపోర్టర్: మహేష్ స్థలం: మక్కువ

మక్కువ మండల పరిధిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. పాపయ్యవలసలో దసరా వేడుకలు చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వైకంటపు గిరి, శివకోటి రవి అక్కడికక్కడే మరియు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రవీంద్రరాజు వివరించారు.