జిల్లాల పునర్విభజనతో ముగిసిన ఉమ్మడి విజయనగరం జడ్పీ ప్రస్థానం

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం గురువారంతో ముగిసింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇకపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వేర్వేరుగా జడ్పీలు ఏర్పాటవుతున్నాయి. నలభై ఏళ్ల చరిత్ర కలిగిన ఉమ్మడి జడ్పీ ప్రస్థానం ముగియనుండటంతో, కొత్తగా ఏర్పడనున్న రెండు జిల్లాలకు మండలాల వారీగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల ఇరవై ఐదు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన జడ్పీ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.