ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంలో మద్యం దుకాణాల సంఖ్యను పెంచలేదు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 ఓపెన్ కేటగిరీ, 340 కల్లుగీత కార్మికుల రిజర్వ్డ్ దుకాణాలు కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేశారు. దుకాణాలు, పర్మిట్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు, ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.