మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీలో ఆయుధాలు చోరీ చేసిన మాజీ సైనికుడు అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీ నుంచి 12 సైనిక స్థాయి ఆయుధాలను చోరీ చేసిన రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే అతను ఈ దురాగ్యానికి పాల్పడ్డాడని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.