ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం పాల వ్యాన్ డ్రైవర్ మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హనుమకొండ
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ స్టేజి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాల వ్యాన్ డ్రైవర్ కనకం శరత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని పరకాల నుండి హనుమకొండ వైపు వెళ్తున్న శక్తి మిల్క్ డెయిరీ పాల వ్యాన్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామానికి చెందిన శరత్ కుమార్ తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తండ్రి కనకం ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ జి.బాబులాల్ వెల్లడించారు.