గణేష్ నిమజ్జనంలో ప్రమాదం హల్ది కాలువలో యువకుడు గల్లంతు

రిపోర్టర్: అశోక్ స్థలం: మాసాయిపేట

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కమిండ్ల గణేష్ ప్రమాదవశాత్తు హల్ది ప్రాజెక్ట్ కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే చెల్లెలి వివాహం జరిపించిన గణేష్ కాలువలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.