వాయుగుండం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయ్యన్న పాత్రుడు
రిపోర్టర్: రాము
స్థలం: అనకాపల్లి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు.