గోదావరిఖని కార్మిక గర్జన సభ విజయవంతంపై మంథనిలో ముఖ్య నేతల సమావేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: మంచిర్యాల

ఈ నెల పద్నాలుగో తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న కార్మిక గర్జన బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా మంథనిలో పుట్ట మధు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగిందని బాల్క సుమన్ - మాజీ ఎమ్మెల్యే చెన్నూర్ వెల్లడించారు. ఈ సభకు కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాంత కార్మిక సమస్యలపై భవిష్యత్తులో మరింత గట్టిగా పోరాడుతామని నాయకులు స్పష్టం చేశారు.