మంచిర్యాలలో విద్యార్థులను ప్రమాదకరంగా తరలిస్తున్న డ్రైవర్‌పై కేసు నమోదు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ప్రాంతంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనాన్ని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను ప్రమాదకరంగా తరలిస్తున్న డ్రైవర్‌ను గుర్తించి డీడీ కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.