విద్యార్థులకు అలర్ట్: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో కొత్త మూల్యాంకన విధానం అమల్లోకి రానుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ విధానంలో భాగంగా మొత్తం మార్కులలో ఇరవై శాతం ఇంటర్నల్ అసెస్మెంట్కు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని, దీనికి సంబంధించిన విధివిధానాలను కాలేజీలకు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసినట్లు మండలి పేర్కొన్నది.