అమెరికా మధ్యకాలిక ఎన్నికలే దేశ చరిత్రలో అత్యంత కీలకమన్న డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: మహేష్
స్థలం: Washington
అమెరికాలో మంగళవారం జరగనున్న మధ్యకాలిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అత్యంత ప్రమాదకరమైన అభ్యర్థులను బరిలో నిలిపిందని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పై పట్టు కోల్పోతే తనపై అభిశంసన ముప్పు ఉంటుందని ఆయన గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.