డీఎస్సీపై విమర్శలా?.. వైసీపీకి మాట్లాడే అర్హత లేదు: సోమిరెడ్డి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: విజయవాడ సెంట్రల్
ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా 16,400 పోస్టులను భర్తీ చేసిందని, మెగా డీఎస్సీ నారా లోకేష్ బ్రాండ్ అని స్పష్టం చేశారు.
ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై వైసీపీ దుష్ప్రచారం చేయడం వారి కుటుంబాలను వేధించడమేనని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాముల్లో అగ్రస్థానంలో ఉన్న జగన్ రెడ్డి జట్టు, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.