ప్రాజెక్టుల పూర్తితో జగన్ నిద్ర కరువు: సోమిరెడ్డి ఫైర్

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: విజయవాడ సెంట్రల్

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని సోమిరెడ్డి విమర్శించారు. వెలిగొండ, పోలవరం కాలువల ద్వారా సాగునీరు అందుతుంటే, ఓర్వలేని జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

గత వైసీపీ పాలనలో గ్రూప్-1 పరీక్షలను అపహాస్యం చేశారని, ఓఎంఆర్ షీట్లపై వైట్నర్లతో అక్రమాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి గుర్తుచేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ అండ్ కో పనిచేస్తోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.