తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ తీరం వైపు పయనిస్తోందని, రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. రానున్న ఐదు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని మంత్రి సూచించారు.