కొండా సురేఖకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న సురేఖతో ఆమె మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆమె అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.