కుంభకర్ణ ప్రభుత్వ నిద్రను బీఆర్ఎస్ పోరాటంతోనే వదిలించాం
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని, అది కుంభకర్ణ ప్రభుత్వమని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీఆర్ఎస్ ముళ్లకర్రతో పొడిస్తేనే రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర వీడుతోందని విమర్శించింది. కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల, పాలమూరు–రంగారెడ్డి పనుల్లో కదలిక, కల్వకుర్తి పంపులు ఆన్, అలాగే జూరాల నుంచి నీటి విడుదల వంటివన్నీ బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మరియు పోరాటం వల్లే సాధ్యమయ్యాయని స్పష్టం చేసింది.