'నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి': ఖమ్మంలో పేదల ఆందోళన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఖమ్మం
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతల ఘటన మరువక ముందే రేవంత్ ప్రభుత్వం మరోసారి పేదల ఇళ్లపై పంజా విసరడాన్ని బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వారు భారీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.