కొండపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు అవాంఛనీయ ఘటనల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు Vijayawada City Police వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెస్ట్, ఏసీపీ వెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా మరియు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు స్థానికులకు పూర్తి భరోసా కల్పించారు.