తుఫాన్ ముప్పు: విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన అధికారులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు విద్యుత్ సిబ్బంది అందరి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ పనుల కొరకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.