ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనని తేల్చిచెప్పిన మహేంద్ర సింగ్ ధోని
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని ధోని స్వయంగా చెప్పినట్లు మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గానే కొనసాగుతానని ధోని స్పష్టం చేశారని పేర్కొన్నారు. మరోవైపు, శివం దూబేను బౌలర్‌గా ఉపయోగించుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం విఫలమైందని బద్రీనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధోని ఫిట్‌నెస్ మరియు జట్టు వ్యూహాలపై ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.