ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: గ్రేప్ మొదటి దశ ఆంక్షలు అమలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Delhi

ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలుష్య నియంత్రణ మండలి జీఆర్ఏపీ మొదటి దశ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాలి నాడ్యత సూచీ రెండు వందల నలభై నాలుగుకు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ధూళి నియంత్రణ, రోడ్ల ఊడ్చివేత వంటి చర్యలతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందస్తుగా ఈ నిబంధనలను కఠినతరం చేశామని వైద్య నిపుణులు వెల్లడించారు.