సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తండకారి చిత్రం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తమిళనాడు
ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న విమల్, శ్రియ సరన్ నటించిన తమిళ చిత్రం 'తండకారి' సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్.మధేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సినిమా 'మై బాస్'కి రీమేక్. లండన్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల ముందే ఈ సినిమా మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం.