స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆరేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2019, 2020లలో నియమితులైన దాదాపు 1,35,000 మంది ఉద్యోగులలో అర్హులైన వారందరికీ 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారం ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ వర్తిస్తుందని ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.