కావేరీ జల వివాదంలో థర్డ్ పార్టీ పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
కావేరీ జలాల్లో కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలంటూ ఓ ప్రైవేట్ సొసైటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్-పార్టీలు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసిన న్యాయస్థానం, నదీ జలాల కేటాయింపులపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే మాట్లాడే హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది.