విఘ్నాలు తొలగించి సర్వశుభాలు కలగాలని కోరిన సూర్కంటి శ్రీధర్ రెడ్డి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలో ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనసారా ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.