ఓపెన్‌ఏఐ సిస్టమ్‌ను విజయవంతంగా హ్యాక్ చేసిన ముగ్గురు భారతీయ టెక్కీలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తూ హ్యాక్ట్రాన్ ఏఐకి చెందిన ముగ్గురు భారతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణులు హర్ష్ జైస్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైని లు ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ టూల్ సహాయంతో ప్రముఖ సంస్థ ఓపెన్‌ఏఐ సిస్టమ్‌ను విజయవంతంగా హ్యాక్ చేశారు. అధికారిక బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా కేవలం 72 గంటల్లోనే ఈ భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చి ఓపెన్‌ఏఐ ప్రైవేట్ రిపాజిటరీని యాక్సెస్ చేయగా, స్పందించిన సంస్థ ఆ టెక్కీలకు రివార్డు అందజేసింది.