అక్రమ కేసులతో బెదిరించలేరంటూ రేవంత్ సర్కార్పై కవిత తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్లో పసికందుల మరణాలు అత్యంత బాధాకరమని, కాంగ్రెస్ పాలనలో వైద్య, విద్యారంగాలు పూర్తిగా గాడితప్పాయని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు.