టెక్ వార్త: కృత్రిమ మేధస్సు డేటా సెంటర్ల కోసం విమాన ఇంజిన్ల వినియోగం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Arizona
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా కేంద్రాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అమెరికా సరికొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అరిజోనా ఎడారిలో నిలిపివేసిన రిటైర్డ్ విమానాల జెట్ ఇంజిన్లను సేకరించి విద్యుత్ జనరేటర్లుగా మారుస్తున్నట్లు నిపుణులు తెలిపారు. స్థానిక గ్రిడ్లపై భారం తగ్గించేందుకు ఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తున్నామని, దీని ద్వారా భారీగా శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఇంజనీరింగ్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయని అపోలో సీఈఓ బిల్ క్లేమన్ పేర్కొన్నారు.