తోటపల్లిలో రికార్డు ధర పలికిన వినాయకుని లడ్డూ వేలం

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుని లడ్డూ వేలంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ వేలం పాటలో, పెద్ద బాల్ రెడ్డి రూ.1,05,116 చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. ఈ రికార్డు ధరతో గ్రామంలోని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. నిమజ్జన ఊరేగింపులో భక్తుల కోలాహలం మిన్నంటింది.