సుద్దవాగు తండా దాడి కేసులో ముగ్గురి అరెస్టు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తిరుమలాయపాలెం

తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తండా వద్ద కాంగ్రెస్ నాయకుల కారుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అన్నదాన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్సై కూచిపూడి జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు భానోత్ కిషన్, బానోత్ మోహన్, బానోత్ రవిలను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.