గణేష్ శోభాయాత్ర బందోబస్తుపై ఎస్పీ వినీత్ సమీక్షా సమావేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లాలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించి, మఫ్టీ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండారెడ్డిపల్లి చెరువు, బువ్వమ్మ గుట్ట, తాకీ బాబా దర్గా వద్ద అదనపు భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు.