పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు మార్చికి పూర్తి చేయాలి

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నీటి ప్రణాళికలు రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ ప్రకారం పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.