అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆఫీస్ ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: సిద్దిపేట
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని హరీష్ రావు ఆఫీస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగరేణి ప్రాంత కార్మికులకు ఇంటి హక్కులు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పందొమ్మిదవ సంవత్సరంలో డెబ్బై ఆరు నెంబర్ జీవోను జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టి సింగరేణి ప్రాంతంలో ముప్పై వేల మంది కార్మికుల ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చారంటూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర నిప్పులు చెరిగారు.